ప్రేమ - దొరికితే అదృష్టం ....దొరికిన తరువాత సాధించుకోలేక పోవడం దురదృష్టం
అయినా ఒక్క సారి ప్రేమిస్తే ప్రేమ అని అందరు నమ్ముతారు . నా లాగా ఇలా 3 వ అమ్మాయిని ప్రేమిస్తే ఈ లోకం ఎలా నమ్ముతుంది. అసలు నా తల్లితండ్రులు మాత్రం ఎలా నమ్ముతారు. తీరా ఒప్పుకున్నారు కదా అనుకుని సంతోషపడ్డాను, ఆ సంతోషం చాల రోజులు నివలేకపోతోంది, అమ్మాయి ఇంట్లో ఒప్పుకోకుంటే పెళ్లి చేసే ప్రసక్తి లేదు అంటున్నారు మా వాళ్ళు. ఇది ఎక్కడి చోద్యమో నాకు తెలియట్లేదు ఇంట్లో వాళ్ళు వోప్పుకోలేదని అమ్మాయిని వదిలేయ్ మనడం నిజంగా చాలా దారుణం.
అమ్మ - నాన్న : నన్ను క్షమించండి ఒక్క సారి మీరు వోప్పుకుంటారని అనుకుని ప్రేమించాను కాని మీరు వొప్పుకోలేదు, మీకోసం ఆ అమ్మాయిని వదిలేసాను. ఇంకో అమ్మాయి నన్ను ఇష్టపడుతోంది అని చెబితే ఆ విషయాన్ని లాగి లాగి చివరికి ఏమి కాకుండా చేసారు, సరే అని ఆ అమ్మాయిని వదిలేసాను. ఇప్పుడు నేను ఇంత వరకు ప్రేమించనంత ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చెయ్యండి అని అడిగితే ఒక్క సారిగా వొప్పుకున్నారు, కాని వోప్పుకున్నట్టు వొప్పుకుని ఇప్పుడు కాదంటున్నారు నేనిప్పుడు ఏం చెయ్యాలి, మళ్ళి routine గా మీ కోసం ఈ అమ్మాయిని కూడా వదిలేయాల, వదిలేసి మళ్ళి వెదవను కామంటార. నాకేంటి ఎప్పుడో నేను వెదవను అని ముద్రవేసారు కాని ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి. నన్ను ప్రేమించడం ఆ అమ్మాయి చేసిన తప్పా.
"చిన్ను" నిన్ను ఎంతగా బాధపెడుతున్నానో నాకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళు పెడుతున్న తొందరతో నా స్వార్ధం కోసం నిన్ను మీ ఇంట్లో మాట్లాడి ఒప్పించమన్నాను, కాని మీ ఇంట్లో వాళ్ళు కూడా మనకు ఎదురు తిరిగారు. ఇప్పుడు ఏం చెయ్యాలి, వీళ్ళు అందరు వద్దు అని మన దారి మనం చూసుకోవాలా లేక వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినట్టు పెళ్లి వేరే వాళ్ళతో చేసుకోవాలా.
ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం .............. చావు .......... దీన్ని చేరుకుంటే ఏ బాధ ఉండదు. అసలు నేను ఇంత పిరికివాడిని ఎందుకు అవుతున్ననో అర్థం కావడం లేదు. "చిన్ను" ఎట్టి పరిస్థితి లోను నేను నిన్ను వదులుకోలేను ఇంతకన్నా నేను చావునే కోరుకుంటాను. నువ్వు లేని నా జీవితం ఊహించుకోలేక పోతున్నాను, ఇంకా కాదు కూడదు అంటే ఏదో నాకు ఉన్న ఒక మొబైల్, ఒక బైక్, ఒక ఉద్యోగం ఇలాగే ఒక పెళ్ళాం అనే దాన్ని కట్టుకుని వీళ్ళ ముందర సంతోషంగా ఉన్నట్టు నటించాలి :(
కాని నాకు ఆ life ఇష్టం లేదు, నీతో ఉంటె కష్టం కూడ యిష్టంగా అనిపిస్తుంది రా. నా మనసులో ఉన్న ఈ బాధ ను ఎవరి కన్నా చెబితే నవ్వి ఊరుకుంటారు అంతే, ఎందుకంటే నేనెప్పుడు ఇంత sentimental గా ఉండలేదు. పైగా అందరూ నేను ఒక తిరుగుబోతును అని వెదవను అని decide అయిపోయారు, వాళ్లకు నా బాధ ఒక jokeలా అనిపిస్తుంది కాని అసలు అర్థం చేసుకోలేరు. అసలు ఇక్కడ ఏం రాయాలి అనుకుంటున్నానో అర్థం కావడం లేదు, కాని మనసు మాత్రం చాలా బాధతో నిండిపోయి ఉంది. ఆ బాధను ఎవరితోనైనా పంచుకోవాలి అనిపిస్తోంది. కాని నన్ను నన్నుగా ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు నువ్వు తప్పా. కాని నువ్వు కూడా బాధ లో ఉన్నావు, నీకు ఈ విషయాలు చెబితే నువ్వు ఇంకా చాలా disturb అవుతావు. ఎందుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు బుర్ర నిండా తిరుగుతున్నాయి, అసలు ఎమైపోతానో అని భయంగా ఉంది .
ఎందుకు మనకు ఈ శిక్ష ఏం తప్పు చేసాము.
ఒకరినొకరు ఇష్ట పడ్డాము ఆ విషయం దైర్యంగా ఇంట్లో చెప్పాము ఇదే నా మనము చేసి నేరం :(
ఈ ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికన్నా దూరంగా వెళ్లిపోవాలి అనిపిస్తోంది. ఈ బంధాలు అనుబంధాలు ఏంటో మరీ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. చివరిగా ఒక్కటే నాకు అర్థమయ్యింది చిన్ను నువ్వు లేకుండా నా lifeలో నేను నిజంగా dead bodyనే రా.
fullగా మందు కొట్టి గట్టిగా అరవాలని ఏడవాలని ఉంది కాని కుదరడంలేదు. మందు కొట్టానని నీకు, మా అమ్మకు మాట ఇచ్చేసాను. Atleast ఇప్పుడు వింటున్న ఈ సినిమా పాటలైనా (sad songs) నాకు కొద్దిగా ఓదార్పుగా ఉన్నాయి.
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా .....ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమని ...నా దారి నీ వలపని...నా చూపు నీ నవ్వని....నా ఊపిరే నువ్వని..నీకు చెప్పాలని
నేను అని లేను అని చెబితే ఎం చేస్తావు...నమ్మనని నవ్వుకొని చాల్లే పోమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని...నీ తనువులోని స్పర్సగా తగిలేది నేనని
నీ కంటి మైమరుపులో నను పోల్చుకొంతానని...తల ఆన్చి నీ గుండెపై నా పేరు వింటానని....నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా .....ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమని ...నా దారి నీ వలపని...నా చూపు నీ నవ్వని....నా ఊపిరే నువ్వని..నీకు చెప్పాలని
నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం...నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదని...నిను కలుసుకున్న ఆ క్షణం నను వోదిలిపోనని
ప్రతి ఘడియ ఓ జన్మగా నేగడుపుతున్నానని...ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసా అని...నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా .....ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమని ...నా దారి నీ వలపని...నా చూపు నీ నవ్వని....నా ఊపిరే నువ్వని..నీకు చెప్పాలని
This song is dedicated for you-U- my love :(